హత్నూర: హత్నూర అంబేద్కర్ గురుకుల కళాశాలలో నవంబర్ 6 నుంచి 8 వరకు 11 వ జోనల్ స్పోర్ట్స్ మీట్
సంగారెడ్డి జిల్లా ఆత్ముర అంబేద్కర్ గురుకుల కళాశాలలో నవంబర్ 6 నుంచి 8 వరకు 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బుధవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 11 పాఠశాల నుండి ఒక్కొక్క పాఠశాల నుండి 85 మంది పిల్లలు, 935 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. వాలీబాల్ హ్యాండ్ బాల్ అథ్లెటిస్, కోకో కబడ్డీ ఫుట్బాల్ మొదలైన క్రీడాలు అండర్ 14 17 19 స్థాయిల విద్యార్థులకు నిర్వహించనున్నట్లు. క్రీడలు నిర్వహించే క్రీడా ప్రాంగణాన్ని జిన్నారం సీఐ రమణారెడ్డి, ఎస్సై శ్రీధర్ రెడ్డి పరిశీలించి ఎటువంటి అసౌకర్యం కలవకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.