మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంలోనే నడపాలని, ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మూలం రెడ్డి ధ్రువ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం అయినా విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.ప్రజా ఆరోగ్యాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్న చంద్రబాబు పిపిపి విధానాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.