మాచర్లలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన
గుంటూరులో పారిశుధ్య కార్మికురాలిపై అసభ్యకరంగా ప్రవర్తించిన కార్పొరేటర్ సుంకర శీనుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాచర్ల మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సోమవారం నిరసన తెలిపారు. అధికారుల పట్ల కూడా అగౌరవంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీటీయూ, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.