కరీంనగర్: యూరియా కోసం కరీంనగర్ లో రైతులు వినూత్నంగా బతుకమ్మ ఆడుతూ నిరసన, మద్దతు తెలిపిన ఎమ్మెల్యే అరెస్టు
కరీంనగర్ మండలం దుర్షేడ్ లోని రాజీవ్ రహదారిపై యూరియా కోసం మహిళలు వినూత్న రీతిలో సోమవారం మధ్యాహ్నం 2గంటలకు వినూత్నంగా నిరసన తెలిపారు. బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తంచేశారు. వీరికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కారణంగానే రైతులకు యూరియా కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందివ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు ఆందోళన చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.