పంచమి తీర్థానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది : ఎస్పీ
తిరుచానూరు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జరిగే పంచమి తీర్థానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరుకు వచ్చే రోడ్లపై హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారుల సూచనల మేరకు అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు మరింత ఘనంగా జరిగే విధంగా ప్రత్యేక భద్రత చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.