కర్నూలు: హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడవద్దు మందులు సక్రమంగా వాడి, జీవితకాలం పెంపొందించుకోండి:జిల్లా కలెక్టర్ సిరి
హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడవలసిన అవసరం లేదని, ఏ.ఆర్.టి. మందులు సక్రమంగా వాడడం ద్వారా జీవితకాలం పెంపొందించుకోవడంతో పాటు, ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రపంచ ఎయిడ్స్ డే - 2025 సందర్భంగా జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో హెచ్.ఐ.వి ఇన్సిడెంట్ లు 0.57 శాతం ఉన్నాయన్నారు.. 7 వేల మంది ఏ.ఆర్.టి. మందులు వాడుతున్నారన్నారు..