మేడ్చల్: ఘట్కేసర్ తాహసిల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్న నిరాహారదీక్షకు మద్దతు తెలిపిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో ఘట్కేసర్ తాసిల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోమవారం మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా రైతుల రుణమాఫీ చేయడంలో విఫలమైందని విమర్శించారు. గత బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా విరాజిల్లిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మల్లారెడ్డి అన్నారు.