పత్తికొండ: పత్తికొండలో మిద్ది పైకి ఎక్కి దిగే సమయంలో కాలుజారి కిందికి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
పత్తికొండ లో మిద్దెపై నుంచి జారి పడి ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పట్టణంలోని కటెకె వీధిలో నివాసం ఉంటున్న అదే కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు మిద్దె పైకి ఎక్కి దిగే సమయంలో జారి పడి పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తీసుకెళ్లారు. తలకు తీవ్ర గాయం కావడంతో పాటు కోమాలోకి వెళ్లడం తో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య కోసం వైద్యులు సలహా మేరకు కర్నూల్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.