యర్రగొండపాలెం: దోర్నాలలో దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధ వేడుకలు
ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 12 అడుగుల నరకాసుర ప్రతిమను తమిళనాడు నుంచి తెప్పించి గ్రామ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసి నరకాసుర వధ చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి వేడుకలను వీక్షించారు.