యర్రగొండపాలెం: తీగలేరు బాబు బిడ్జి పునరుద్ధరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని గంటవానిపల్లి సమీపంలో దెబ్బతిన్న తీగలేరు వాగు బిర్జి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్ ఈ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.