మార్కాపురం: మాదిరెడ్డిపాలెంలో నాసర్ మహమ్మద్ వలి గంధ మహోత్సవ వేడుకలు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామంలో నాసర్ మహమ్మద్ వలి గంధ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాధ్యత సంఖ్యలో భక్తులు దర్గాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేడుకల్లో భాగంగా టిడిపి వైసిపి పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్రభలపై డాన్సులతో డాన్సర్లు యువతను ఉత్తేజపరిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.