కళ్యాణదుర్గం: తిమ్మాపురం లోని గ్రామ సచివాలయంలో ఉద్యోగుల హాజరు కాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనం
కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలోని గ్రామ సచివాలయం లో మధ్యాహ్నం 12 గంటలైనా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరు కాలేదు. సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరాశతో వెను తిరుగుతున్నారు. ప్రజల ముంగిటకు సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.