అహోబిలంలో కైశిక ఏకాదశి సందర్భంగా విశేష పూజలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో సోమవారం కైశిక ఏకాదశి పురస్కరించుకొని ఆలయ అర్చకుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ ప్రధాన అర్చకుడు కిడంబి వేణుగోపాలస్వామి ఆధ్వర్యంలో శ్రీ భూమి నీలా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి దిగువ అహోబిలం ఆలయంలో లక్ష తులసి అర్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించారు, పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలో పాల్గొన్నారు