విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా
Eluru Urban, Eluru | Sep 22, 2025
ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద తూర్పు ప్రాంత విద్యుత్ సరఫరా 11 జిల్లాల JAC ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. 26వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. 7500 JLM ఉద్యోగులను పర్మినెంట్ చేసి సిబ్బందికి ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 25న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.