తాడిపత్రి పట్టణంలోని నందలపాడు శివారులో ఉన్న విశ్వ హిందూ పరిషత్ అనాధ ఆశ్రమంలో పట్టణ సీఐ ఆరోహణరావు, ఎస్సై గౌస్ బాషా ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అనాధ పిల్లల మధ్య సోమవారం రాత్రి దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనాధ పిల్లలకు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు. దీపావళి ప్రత్యేకతను అనాధ పిల్లలకు పోలీస్ అధికారులు వివరించారు.