జమ్మలమడుగు: యర్రగుంట్ల : జి.ఆర్.పీ.పోలీస్ స్టేషన్‌లో రైల్వే డిఎస్‌పి హర్షిత ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ల యర్రగుంట్ల మండలం యర్రగుంట్ల జి.ఆర్.పీ. పోలీస్ స్టేషన్‌లో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. యర్రగుంట్ల జి.ఆర్.పీ. పోలీస్ స్టేషన్‌లో రైల్వే డిఎస్‌పి హర్షిత ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో పోలీసుల మధ్య అనుసంధానాన్ని పెంపొందించడం, పోలీసు వ్యవస్థపై అవగాహన కల్పించడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం మరియు పోలీస్ పట్ల నమ్మకం పెంచడం ప్రధాన ఉద్దేశ్యంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా స్కూల్ చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.