నాయుడుపేటలో లారీ ఢీకొని ట్రాక్టర్ మెకానిక్ మృతి
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎల్.ఏ సాగరానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ లక్ష్మణ్ లారీ ఢీకొని శనివారం మృతి చెందాడు. లక్ష్మణ్ నాయుడుపేటలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ సర్వీస్ కోసం బైకుపై ఓజిలికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మూర్తిరెడ్డిపాలెం వద్ద లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట హాస్పిటల్‌కి తరలించారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.