పెనుకొండలో ఐచర్ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కర్ణాటకకు చెందిన కారు బెంగళూరు వైపు వెళ్తుండగా ఐచర్ను ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న కియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.