పూతలపట్టు: ఎట్టకేలకు తగ్గువారి పల్లి పంచాయతీ సాయినగర్ రోడ్డుకు మోక్షం
బంగారుపాళ్యం మండలం, తగ్గువారిపల్లి పంచాయతీ పరిధిలోని సాయినగర్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా రోడ్డుల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అరగొండ రోడ్డుతో కలుపుతున్న మార్గం మట్టి రహదారిగా ఉండటంతో వర్షాలు కురిసినా, ఎండలు మండినా నరకయాతన అనుభవించాల్సి వచ్చేది. ప్రత్యేకంగా సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రహదారి మొత్తం బురదమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించిన ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. జేసిబి సాయంతో బురద తొలగించి, కొత్త రోడ్డువేయడానికి పనులు ప్రారంభించారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్య పరిష్కారం అవుతుండటంతో సాయినగర్ ప్రజలు ఆనందం