రాజవొమ్మంగి PACS చైర్మన్ గా ముప్పన.కేశవ్ ప్రమాణ స్వీకారం: ముఖ్య అతిథిగా హాజరైన రంపచోడవరం MLA శిరీష దేవి
రాజవొమ్మంగి పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ గా ముప్పన కేశవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజవొమ్మంగి లో జయలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.చైర్మన్ తో పాటు నెంబర్లుగా విసంశెట్టి. చిట్టమ్మ,మద్దేసు.గంగయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం గుర్తిస్తుందని,గత ప్రభుత్వంలో అర్హత ఉన్న తన కుటుంబానికి రుణం ఇవ్వకుండా సంవత్సర కాలం తిప్పారని అర్హత ఉన్న వారికి రుణాలు ఇవ్వాలని అన్నారు.