జమ్మలమడుగు: పోరుమామిళ్ల : పరారీలో ఉన్న ముద్దాయిని అరెస్టు చేసిన పోలీసులు.. బంగారు సరుడు, మోటార్ బైకులు స్వాధీనం
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణంలోని మల్లకత్తువ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా అనుమాన స్పదంగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్దాయిని విచారించగా ప్రకాశం జిల్లా ఈతముక్కల గ్రామానికి చెందిన దర్శినాల ఏడుకొండలు గా గుర్తించామన్నారు. ముద్దాయి వద్ద 35 గ్రాముల బంగారు సరుడుతో పాటు హీరో గ్లామర్ మోటార్ బైక్ లో వస్తూ ఉండగా పోరుమామిళ్ల మల్ల కత్తువ చెక్ పోస్ట్ వద అదుపులోకి తీసుకున్నామన్నారు.