మేడిపల్లి: ఇబ్రహీంపట్నం: పోసానిపేటలో భూ సేకరణకు గ్రామసభ...
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామం పరిధిలో సూరమ్మ ప్రాజెక్టు కుడి కాలువ పనుల భూ సేకరణకు శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. భూములు కోల్పోతున్న వారికి ఎకరానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని బాధిత రైతులు అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్, అధికారులు శ్రీనివాస్, నగేష్ పాల్గొన్నారు.