వనపర్తి: యాత్ర దానం పథకం గోడపత్రికను ఆవిష్కరించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో యాత్ర పథకం గోడపత్రికను వనపర్తి బస్సు డిపో మేనేజర్ వేణుగోపాల్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాత్ర దానమనే వినూత్న పథకాన్ని టీజీఎస్ఆర్టిసి శ్రీకారం చుట్టిందని వ్యక్తుల పుట్టినరోజులు వివాహ మహోత్సవాలకు పేద విద్యార్థులకు విజ్ఞాన యాత్రలకు మరియు భక్తులకు వృద్ధులకు దివ్యాంగులకు పుణ్యక్షేత్రాల పర్యటనకు తీసుకెళ్లడానికి సంస్థ ద్వారా బస్సులను బుక్ చేసి తీసుకెళ్లనవి ఈ యాత్ర దానం ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా అన్నారు.