ఆరోగ్య సర్వేలు పక్కాగా నిర్వహించాలి
: వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి. జగన్మోహన్ రావు
ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతీ ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి సర్వే పక్కగా చేపట్టాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. మక్కువ, శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు.గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందుతున్న తీరుపై,ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించి ప్రగతి నివేదికలను పరిశీలించారు.కొత్తగా నివేదించిన ఆశా సర్వే రికార్డ్స్ పై ఏమేరకు పరిజ్ఞానం ఉందో గమనించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.