అనంతపురం నగర శివారులోని కురుగుంటలో శనివారం రాత్రి నాగేంద్ర అనే వ్యక్తిపై అతని కుమారుడు బ్యాటుతో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. దీంతో గాయాలైన అతనిని అతని కుమారుడు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.