మహదేవ్పూర్: అక్రమంగా యూరియా తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా, నమ్మదగిన సమాచారం రావడంతో, ఆగ్రోస్ మహాదేవపూర్ 2 లో ట్రాక్టర్లో యూరియా తరలిస్తుండగా, ఆపి తనిఖీ చేయగా ఏలాంటి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.