రాయదుర్గం: గోనబావి గ్రామంలో మూడేళ్లుగా మూతబడిన వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్
గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో పంచాయతీ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిరుపయంగంగా మారింది. 3 ఏళ్ల క్రితం ప్లాంట్ మూతబడగా నేటికీ తెరచుకోలేదు. ఉపయోగంలో లేక లక్షల విలువైన యంత్ర పరికరాలు పాడవుతున్నాయి. మరోవైపు గ్రామస్తులు ఒక్కొక్క క్యాన్ రూ.15 వెచ్చించి కొనాల్సి వస్తోందని తెలిపారు. ఫ్లాంట్ తెరిపించాలని గ్రామస్తులు కోరారు. పంచాయతీ కార్యదర్శి మధు దృష్టికి తీసుకెళ్లగా వారంరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.