ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని బాలిక తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. 14 సంవత్సరాల మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేసినట్లుగా బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ సురేష్ అన్నారు.