తాడికొండ: అమరావతి నమూనాల పరిరక్షణకు చర్యలు
అమరావతి నమూనాల పరిరక్షణకు సీఆర్డీఏలోని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం అమరావతి ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో సందర్శిస్తారు. సీఆర్డీఏకు సంబంధించిన నమూనాలను నిరంతరం తనిఖీ చేస్తారు. ఉద్దండ్రాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ప్రత్యేక సెక్యూరిటీ గార్డులను నియమించి అక్కడ నమూనాల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు చేపట్టామని సీఆర్డీఏ కమీషనర్ వివేక్ యాదవ్ తెలిపారు.