కర్నూలు: కర్నూలు జిల్లాలో డిసెంబర్ మాసంలో 2,37,733 మందికి రూ.104.32 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ: జిల్లా కలెక్టర్ సిరి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద డిసెంబర్ మాసంలో జిల్లాలో అర్హులైన 2 లక్షల 37 వేల 733 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.104.32 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని కృష్ణ నగర్ లో ఉరుకుంద, వడ్డే నాగరాజు లకు వికలాంగుల పెన్షన్, పుల్లమ్మ, చిన్న హుస్సేన్ లకు వృద్ధాప్య పెన్షన్, వసుంధర, లక్ష్మీదేవి లకు వితంతువు పెన్షన్ లను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్ అందజేశారు