నవంబర్ 2వ తేదీన ఒంగోలు రోడ్డులో నిర్వహించే కోటి దీపోత్సవం వాల్ పోస్టర్ ను ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి టిడిపి కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. కోటి దీపోత్సవం గిద్దలూరులో నిర్వహిస్తున్న పొలం రెడ్డి బాలకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అభినందించారు. కార్తీకమాసం పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ఎమ్మెల్యే కొనియాడారు.