మేడ్చల్: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ మిస్సింగ్
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ కనిపించకుండా పోయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మౌలాలి ఎస్పీ నగరకు చెందిన అబ్దుల్ సిగరెట్ తాగడానికి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో భార్యా షేక్ షాహిదా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె సమాచారం పై మల్కాజిగిరి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.