బనగానపల్లె మండలం లో పాము కాటుతో మహిళ మృతి
పొట్టకూటి కోసం ఉపాధి పనులకు వెళ్లి పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన విషాదకర ఘటన బనగానపల్లె మండలంలోని ఎనకండ్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రమాదేవి(38) ఉపాధి పనుల్లో భాగంగా కైప గ్రామ సమీపంలోని పొలంలో పనులు చేస్తూ ఉండగా పాము కాటుకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.