కుప్పం: కుప్పం : మహిళపై దాడి 8 మంది పై కేసు నమోదు.
శాంతిపురం (M) వెంకటేశ్ పురంలో ఓ మహిళపై దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ సోమవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్పష్టం చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మహిళపై దాడి చేశారని, మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సోమవారం డీఎస్పీ పార్థసారథి పరిశీలించారు. గ్రామాల్లో ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.