నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం బాల బాలికలు బాల్య వివాహంలో ఎదిరించాలని ముచ్చు మర్రి ఎస్సై నరేంద్ర అన్నారు, శుక్రవారం పగిడ్యాల మండలం లక్ష్మాపురం అంచె సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి, వందేమాతరం ఆవశ్యకతను వివరించారు, బాలికలు ఫైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై నరేంద్ర సూచించారు, బాల్యవివాహాలు జరుగుతే వెంటనే 100కు డయల్ చేయాలని బాలికలకు ఎస్ఐ సూచించారు, ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు