అనంతపురం నగర శివారులోని ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమీపంలో ఉన్న కాలువలో ఈత కోసం వెళ్ళిన బెలుగుప్ప ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ రెడ్డి ఆదివారం సాయంత్రం నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆయనను వెతికేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గజ ఈతగాళ్లతో గల్లంతైన వైద్యుడిని వెతికెందుకు చర్యలు చేపట్టారు.