మనోహరాబాద్: తూప్రాన్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు
తూప్రాన్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో బుధవారం ఉదయం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్డీఓ జయచంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే ఆయా కార్యాలయాల వద్ద కమిషనర్ గణేష్ రెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్, తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో సతీష్, సీఐ రంగకృష్ణ, శివానందం జెండాలు ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగంతో తెలంగాణ సాధించుకున్నామని సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని వారన్నారు.