తాడిపత్రి: తాడిపత్రి మండల పరిధిలోని ఆర్డీటీ కాలనీలో పోలీసులు తనిఖీలు, మట్కా బీటర్ అరెస్ట్, నగదు స్వాధీనం
తాడిపత్రి మండల పరిధిలోని ఆర్డీటీ కాలనీలో రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ధరణి బాబు పోలీస్ సిబ్బందితో కలిసి మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలనీలోని ఓ ప్రాంతంలో మట్కా రాస్తున్న చాంద్ బాషా ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.12,410 నగదు తో పాటు మట్కా చీటీలను, బాల్ పెన్నులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్ఐ ధరణి బాబు కేసు నమోదు చేశారు.