రాయదుర్గం: పట్టణంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం
రాయదుర్గం పట్టణంలో దసరా ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకున్నాయి. పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో మంగళవారం ఉదయాన్నే 8 వ రోజు దుర్గాష్టమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని విషయంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. బళ్లారి రోడ్డులో ఉన్న చిన్న బన్నీ మహంకాళి ఆలయం వద్ద జమ్మిచెట్టు ప్రదక్షిణలు చేయడానికి తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భజన కీర్తనలు భక్తులను అలరించాయి. నగరేశ్వర స్వామి ఆలయంలో దుర్గాదేవిగా కన్యకాపరమేశ్వరి దేవి ని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.