ప్రొద్దుటూరు: నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
Proddatur, YSR | Oct 29, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముంథా తుఫాన్ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం. చంద్రబాబు నాయుడుకు లేఖ రాసినట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. సాగుచేసిన వరి, పత్తి, కంది, మినుము పంటలు దెబ్బ తిన్నాయన్నారు.రబీ బుడ్డ శనగ సాగు కోసం పొలాల్లో వేసిన ఎరువులు నీటిలో కొట్టుకు పోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు