మేడిపల్లి: నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: పోలీసు స్టేషన్లో మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు
నేటి యువత మత్తు పదార్థాలకు బానిసగా కాకుండా వ్యవహరించాలని క్రీడలరంగం పట్ల దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మెట్పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు అన్నారు మేడిపల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ,ప్రస్తుత తరుణంలో యువత గంజాయి,డ్రగ్స్ వైపు మల్లవద్దని మత్తుపదార్థల వల్ల జీవితం నాశనం అవుతుందని తెలిపారు. మేడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రానున్న రోజుల్లో యువకులకు మత్తు పదార్థాల పట్ల జరిగే దుష్పరిణామం పట్ల కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు