ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో మండల ప్రత్యేక అధికారి కుమార్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆర్ఓ ప్లాంట్, వంటగది, స్కూల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ సుబ్బయ్య సుధాకర్ ఎంపీడీవో అజితా తదితరులు పాల్గొన్నారు.