ఆలూరు: ఆస్పరిలో పరిమితికి మించి ప్రయాణం ప్రమాదమని చెప్పిన, పట్టించుకోని డ్రైవర్లు
Alur, Kurnool | Nov 2, 2025 ఆస్పరిలోని ముత్తుకూరు క్రాస్ రోడ్డులో ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం రోజురోజుకూ మితిమీరుతోంది. పరిమితికి మించి ఆటోల్లో ఎక్కించుకొని వేగంగా వెళ్తున్నారు. ఆటోలో 15 మందికి పైగా కూలీలను ఎక్కించుకొని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఈ మార్గంలో ఎన్నో ప్రమాదాలు జరిగి, ప్రాణాలు పోయాయి. అయినా పరిస్థితి మారలేదు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.