స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎన్జీవో హోమ్ లో గురువారం బిఎస్పి ఆధ్వర్యంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జనగణన, కులగనన సర్వేలపై ప్రజలు అయోమయంలో ఉన్నారన్నారు. వీటిని చేపట్టడం ద్వారా బీసీలకు మరింత మేలు జరుగుతుందని తెలియజేశారు.