ఆర్మూర్: తాళ్ల రాంపూర్ విడిసి పై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ లో ర్యాలీ నిర్వహించిన ఏర్గట్ల గౌడ కులస్తులు
ఏరుగట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ విడిసి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆర్మూర్ సబ్ డివిజన్ లోని గౌడ కులస్తులు మంగళవారం 3: 30 ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. అక్కడి నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తాళ్లరాంపూర్ లో బీడీసీల ఆగడాలు మితిమీరు పోయాయని కళ్ళు అమ్మకం విషయంలో గౌడ కులస్తులను గ్రామ బహిష్కరణ చేశారని తెలిపారు. అధికారులు వీడిసి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.