పలమనేరు: యుద్ధంలో పాల్గొని దేశం కోసం చచ్చిపోతా, మీలాగా సారాయి పొట్లాలు అమ్ముకోను అంటూ టిడిపి నాయకులను విమర్శించిన వైసీపీ నాయకుడు
పలమనేరు: వైసీపీ కార్యాలయంలో మండల వైసీపీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిన్నటి దినం టిడిపి నాయకులు వైసీపీ నాయకులను విమర్శించిన విషయం విధితమే. పలమనేరు అభివృద్ధి పైన దృష్టి సారించమంటే వ్యక్తిగత దూషణలకు దిగి తమ ప్రతిష్ట దిగజార్చుకుంటున్నారని విమర్శించారు.17ఏళ్లు ఆర్మీలో దేశ సేవ చేసి వచ్చిన తనను వ్యక్తిగతంగా దూషణలకు దిగడం బాధ కలిగించింది. యుద్ధం జరిగితే యుద్ధంలో పాల్గొని మరి చనిపోతాను గాని మీలాగా సారాయి అమ్ముకోనని ఆరోపించారు. పలమనేరు పట్టణంలో 26 వార్డులను మున్సిపాలిటీలో గెలిచి చూపిస్తామని సవాల్ విసిరారు.