పుట్టపర్తిలో ఏపీ ఎన్జీవోలు ర్యాలీ, బహిరంగ సభ
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్ వి జె జానకి రామయ్య కళ్యాణ మండపం వరకు మంగళవారం మధ్యాహ్నం ఏపీ ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సత్యసాయి జిల్లాలో నూతన కమిటీలు ఎన్నికై, ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.