అనంతపురం నగరంలోని డిఎస్పీ కార్యాలయం సమీపంలో మద్యం మత్తులో ఆకతాయిల ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన వైనం
Anantapur Urban, Anantapur | Oct 21, 2025
అనంతపురం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న డిఎస్పీ కార్యాలయం వద్ద మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు మంగళవారం మధ్యాహ్నం ఘర్షణకు దిగారు. మద్యం మత్తులో ఉన్న యువకులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడి అలజడి సృష్టించారు. దీంతో నగరంలోని డిఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.