కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రహదారులకు మహర్దశ పడుతుందని కాంగ్రెస్ జిల్లా నాయకులు పేర్కొన్నారు.ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 12వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కౌన్సిలర్ శ్రీలత కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రమేశ్ మాట్లాడుతూ.. నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు