ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మారిన తర్వాత ఏమి చేశాడో చెప్పాలి: రాజేంద్రనగర్ లో పటోళ్ల కార్తీక్ రెడ్డి
రాజేంద్రనగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసి డెవలప్మెంట్ హైడ్రా పేరుతో ప్రజల జీవితాలతో ఈ ప్రభుత్వం మాడుకుంటుందని అన్నారు. మూసి పేరిట మోసం జరుగుతున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎందుకు మాట్లాడడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే పార్టీ మారిన తర్వాత నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేసి చూపించాడో చెప్పాలని ఆయన అన్నారు.